SRCL: ఎల్లారెడ్డి పేట మండలం రాచర్ల బొప్పాపూ శ్రీదేవి, గోదా దేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పురోహితులు కొండపాక నరసింహాచార్యులు, గోపికృష్ణ ఆచార్య, విశ్వనాథశర్మ, శ్రీనివాసశర్మ, శ్రీనివాసాచార్యుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకుంటున్నారు.