HNK: వేలేరు మండల కేంద్రంలోని 9వ వార్డుకు చెందిన బూర జగన్నాథం ఇటీవల మరణించాడు. విషయం తెలుసుకున్న స్థానిక కాంగ్రెస్ నాయకులు గురువారం ఉదయం వారి నివాసానికి వెళ్లి జగన్నాథం చిత్రపటం వద్ద నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి 50 కేజీల బియ్యం బస్తా అందజేశారు. మాజీ ఉపసర్పంచ్ సద్దాంహుస్సేన్, తదితరులున్నారు.