NRML: లక్ష్మణచందా మండల కేంద్రానికి మొక్కజొన్న కొనుగోలు కేంద్రం మంజూరు కావడంతో రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది. BJP పిలుపునిచ్చిన రైతు ధర్నా నేపథ్యంలో మంత్రి నాగేశ్వరరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీహరిరావు ఇచ్చిన వినతిపత్రంపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సమస్య పరిష్కారం కావడంతో ధర్నా కార్యక్రమాన్ని రైతులు విరమించారు.