MDK: రామాయంపేట మండలం సుతారిపల్లి బస్టాండ్ వద్ద సర్పంచ్ మద్దూరి సునీల్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వేసవి దృష్ట్యా బాటసారుల దాహార్తి తీర్చేందుకు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజల సమక్షంలో దీనిని ప్రారంభించారు. సామాజిక బాధ్యతగా చలివేంద్రం ఏర్పాటు చేయడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.