MBNR: దేవరకద్ర మున్సిపాలిటీ నూతన ఛైర్మన్గా దమయంతి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్గా యుగంధర్ రెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి హాజరై నూతన పాలకవర్గాన్ని అభినందించారు. పట్టణ సమగ్ర అభివృద్ధికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.