BDK: వన జీవి రామయ్య సినిమాకు ఇటీవల గద్దర్ అవార్డు వరించింది. ఈ నేపథ్యంలో ఖమ్మం పట్టణంలో డైరెక్షన్ విభాగానికి చెందిన సభ్యులందరు ప్రశంసా పత్రాలను గురువారం అందుకున్నారు. ప్రశంసా పత్రం అందుకున్న శ్రీరాములును ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుక్రవారం అభినందించారు. భవిష్యత్తులో మరిన్ని మంచి చిత్రాలు తీసి తెలుగు సినీ రంగానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు.