JGL: కథలాపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నేడు 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ వాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ముందస్తుగా ఈ టీకా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కథలాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 26 మంది బాలికలకు టీకా వేసినట్లు వైద్యాధికారి సింధూజ తెలిపారు.