SRPT: హుజూర్నగర్ మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు పాలకవర్గం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ సూచించారు. మంగళవారం నిర్వహించిన బడ్జెట్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రూ.33 కోట్లతో రూపొందించిన ప్రణాళికలను సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. పారిశుధ్యం, తాగునీరు, వీధిదీపాల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.