HYD: ప్రముఖ చిలుకూరు ఆలయ ప్రధాన అర్చకులు సౌందరరాజన్ (90) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్య సమస్యలతో చిలుకూరులోని ఆయన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కాగా 1981లో ఏపీ ప్రభుత్వం ఈయనను ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డుతో గౌరవించింది. చిలుకూరు ఆలయంలో హుండీ లేకపోవడం, VIP దర్శనాలు లేకుండా అందరికీ ఒకే క్యూలైన్ వంటి సంస్కరణలు ప్రవేశపెట్టారు.