ASF: ఆసిఫాబాద్ మున్సిపాలిటీ ప్రజలు 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఇంటి పన్నును ఏప్రిల్ నెలలోనే చెల్లించాలని మున్సిపల్ కమిషనర్ గాజానంద్ ప్రకటనలో సూచించారు. ముందస్తుగా పన్ను చెల్లించే వారికి ప్రభుత్వం 5 శాతం రాయితీ కల్పిస్తోందని తెలిపారు. అవకాశాన్ని వినియోగించుకుని సకాలంలో పన్నులు చెల్లించాలని, తద్వారా పట్టణాభివృద్ధికి సహకరించాలని కోరారు.