MHBD: బయ్యారం మండలం కస్తూరి నగరం, రామచంద్రపురం గ్రామాల్లో శుక్రవారం సాయంత్రం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను MLA కోరం కనకయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా MLA మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడమే మా ప్రజా ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు.