MLG: వెంకటాపూర్ మండలం రామానుజాపూర్లో మ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటైన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని బుధవారం రాష్ట్ర పంచాయతీల శాఖ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, సర్పంచ్ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. గ్రామస్తులు తదితరులు ఉన్నారు.