JGL: జిల్లాకు చెందిన చిలివేరి శ్రీ నిత్య ఇస్రో ప్రతిష్టాత్మక ‘యువిక-2026’ కార్యక్రమానికి ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి ఎంపికైన 15 మంది విద్యార్థుల్లో ఆమె ఒకరు. ఈ అరుదైన అవకాశంతో జిల్లా, రాష్ట్రానికి గర్వకారణంగా నిలిచారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బీ. ఎస్ లత ఆమెను అభినందిస్తూ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.