ADB: CMRF పథకం పేద ప్రజలకు వరం లాంటిదని బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. గురువారం రాత్రి బజరహత్నూర్ మండల కేంద్రానికి చెందిన జల్కి పాండురంగ్కు మంజూరైన రూ. 60 వేల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కును గజేందర్ అందజేశారు. వైద్య ఖర్చుల వివరాలను కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో అందజేసి తద్వారా లబ్ధి పొందాలని సూచించారు.