SRD : జిన్నారం మున్సిపల్ కేంద్రంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని ఎస్సై హనుమంతు ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పించారు. భద్రత, అత్యవసర పరిస్థితుల్లో స్పందనపై సూచనలు అందించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జనార్ధన్, అధికారులు, గ్రామస్తులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.