NGKL: నాగర్ కర్నూల్ మండలం నాగనూలులో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవన నిర్మాణానికి ఇవాళ ఎమ్మెల్యే డాక్టర్ రాజేశ్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుని ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు.