BHNG: బీబీనగర్ మండలంలోని ప్రాథమిక పాఠశాల వెంకిర్యాలలో గ్రామ మహిళా సంఘాల అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం కావాలంటే మహిళలు ముందు ఉండాలని గ్రామ సర్పంచ్ నాగలక్ష్మి లక్ష్మీ నారాయణ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని హెచ్ఎం జోసెఫ్ కోరారు.