ASF: కాగజ్ నగర్ పెద్దవాగు బ్రిడ్జిపై మూడో రైల్వే లైన్ పనుల్లో ప్రమాదం చోటుచేసుకుని ఐదుగురు కాంట్రాక్ట్ కార్మికులు గాయపడ్డారు. భద్రతా ప్రమాణాల లోపమే కారణమని CPM జిల్లా కమిటీ సభ్యుడు ఆనంద్ కుమార్ ఆరోపించారు. గాయపడిన వారికి ఉచిత చికిత్స, నష్టపరిహారం ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.