అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్ఫార్మర్ వైర్లు దొంగిలించిన రాఘవేంద్రకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా కోర్టు తీర్పు ఇచ్చింది. 2024లో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, 33 విద్యుత్ దొంగతనాల కేసుల్లో అతని ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.