SRD: పటాన్చెరు పరిశ్రమల CSR నిధులు స్థానిక అభివృద్ధికి వినియోగించాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ఇవాళ కలెక్టర్ ప్రావీణ్యకు వినతి అందించారు. కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా నిధులు ఇతర ప్రాంతాలకు మళ్లించడం అన్యాయం అన్నారు. వెంటనే నిధులు కేటాయించకపోతే ప్రజా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.