అడివి శేష్ ‘డెకాయిట్’ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సమంత చిత్ర బృందానికి సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ తెలిపింది. నిర్మాత సుప్రియ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కాలని, బ్లాక్బస్టర్ విజయాన్ని అందుకోవడానికి ఆమె పూర్తి అర్హురాలని సమంత పోస్ట్ చేసింది. ఇక షానియల్ డియో దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తోంది.