GDWL: గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. ఉండవెల్లి మైనారిటీ బాలికల గురుకులాన్ని సందర్శించిన ఆయన వంటగది, తరగతి గదులను స్వయంగా పరిశీలించారు. విద్యార్థినులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని, వంటశాల పరిశుభ్రంగా ఉండాలని సూచించారు.