ADB: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లే ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు లభించాయని మాల సంఘం మండల అధ్యక్షుడు రాజేశ్వర్ అన్నారు. ఇచ్చోడ మండల కేంద్రంలో సంఘం నాయకులతో కలిసి డాక్టర్ BR అంబేద్కర్ జీవిత చరిత్ర వాల్ పోస్టర్లను బుధవారం ఆవిష్కరించారు. భారత రాజ్యాంగం వల్లే దళిత, గిరిజన, బడుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారం దక్కిందని పేర్కొన్నారు.