AP: విజయవాడలో లూలూ మాల్‌కు కేటాయించిన భూములపై ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ అంశంపై హైకోర్టులో పిల్ దాఖలు కాగా.. న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా లూలూ మాల్‌కు కేటాయించిన భూములను వెనక్కి తీసుకుంటామని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. త్వరలో దీనికి సంబంధించిన జీవో జారీ చేస్తామని వివరణ ఇచ్చింది.