MBNR: పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ‘మేరా యువ భారత్ – వికసిత్ భారత్ 2047’ రాష్ట్ర స్థాయి సెమినార్లో ఎంపీ డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి యువతే పునాది అని, 2047 నాటికి భారత్‌ను అగ్రరాజ్యంగా మార్చడంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. NSS వాలంటీర్లు సమాజ సేవలో నిరంతరం ముందుండాలని ఆకాంక్షించారు.