HYD: అంబర్‌పేటలోని అలీ కేఫ్ చౌరస్తా వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నడుచుకుంటూ వెళ్తున్న ఓ పారిశుద్ధ్య కార్మికురాలిని బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె అంబర్‌పేట అలీ కేఫ్ చౌరస్తాలో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికురాలుగా విధులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.