BDK: దమ్మపేట అర్బన్ కాలనీలోని కోదండరామాలయానికి ప్రహరీ గోడ నిర్మించేందుకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు వినతిపత్రం ఇవాళ అందజేశారు. ఆలయ రక్షణ, అభివృద్ధి దృష్ట్యా ప్రహరీ నిర్మాణం ఎంతో అవసరమని ఆయనకు వివరించారు. సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సాయం చేస్తామని హామీ ఇచ్చారు.