SRD: కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో వారంతపు సంత ( తైబజార్) ఇవాళ ఉదయం 10 గంటలకు గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో వేలం పాట సర్పంచ్ ఎలిచల సుగుణ మల్లారెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి జ్ఞాన్ దేవ్ పేర్కొన్నారు. కావున ఉప సర్పంచ్, పంచాయతీ పాలకవర్గ సభ్యులు,గ్రామ పెద్దలు,గ్రామ ప్రజలు,చిరు వ్యాపారులు, పాల్గొని వేలంపాటను విజయవంతం చేయాలని కోరారు.