NGKL: గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఛలో హైదరాబాద్ కార్యక్రమం తలపెట్టిన నేపథ్యంలో అచ్చంపేట పోలీసులు పలువురు ప్రజాసంఘాల నాయకులను మంగళవారం అరెస్టు చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేశ్, అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నిర్మలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.