NZB: యాసంగి సాగు పనుల్లో నిమగ్నమైన అన్నదాతకు సర్కారు తోడ్పాటు లభించింది. రైతు భరోసా పథకం కింద 2025-26 సీజన్‌కు సంబంధించి నిధుల జమ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం.. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 5,69,770 మంది రైతుల ఖాతాల్లోకి రూ. 274.37 కోట్లు వచ్చి చేరాయి.