వికారాబాద్ జిల్లా కేంద్రానికి హైదరాబాద్ నుంచి వచ్చే ప్రధాన రోడ్డు ఎన్నేపల్లి వద్ద మురుగునీటి గుంట ఏర్పడి వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వికారాబాద్ జిల్లా కేంద్రానికి ప్రధాన రహదారి అయిన మెయిన్ రోడ్డులో డ్రైనేజీ పొంగిపొర్లి ప్రవహిస్తూ దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో అన్నింటికీ తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.