KMM: ఖమ్మం 6వ డివిజన్లో బుధవారం కార్పొరేటర్ నాగండ్ల కోటేశ్వరరావుతో కలిసి నగర మేయర్ పూనుకొల్లు నీరజ డివిజన్ మహిళలకు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. మేయర్ మాట్లాడుతూ.. మహిళా సంఘాల సభ్యులే కాక అర్హత కలిగిన ప్రతీ మహిళకు చీరలు అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు. కాగా, గతంలోనే చీరలు జిల్లాకు చేరగా, కొన్ని ప్రాంతాల్లో పంపిణీ చేశాక నిలిపివేశారు.