ASF: జిల్లాలో 24 గంటల్లో కెరమెరి, దహెగాం మండలాల్లో అత్యధికంగా 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆసిఫాబాద్, కౌటాలలో 42.6, కాగజ్ నగర్, తిర్యాణిలో 42.5 డిగ్రీలుగా రికార్డయ్యాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.