MHBD: కొత్తగూడ మండలం ఎంచగూడ గ్రామానికి చెందిన గుజ్జ కమలాకర్ ఇటీవల తాడ్వాయి – పస్రా రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ క్రమంలో 1996-97 బ్యాచ్‌కి చెందిన పదవ తరగతి మిత్రులు ఆ కుటుంబానికి అండగా నిలిచారు. మొత్తం రూ.55,500 సేకరించి, మంగళవారం ఆ కుటుంబానికి డబ్బు అందించి, మనోధైర్యాన్ని కల్పించారు.