SDPT: మార్కుక్ మండలంలోని పాములపర్తి గ్రామంలోని 10, 11 వార్డుల్లో పందుల స్వైరవిహారం కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంపులుగా సంచరిస్తున్న పందులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నట్లు తెలిపారు. ఈ సమస్యపై స్థానికులు పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్లకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.