ADB: యువత ప్రభుత్వంతోపాటు ప్రవేటు రంగ సంస్థలు కల్పించే ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో నిర్వహించిన జాబ్ మేళాలో SP అఖిల్ మహాజన్‌తో సమావేశమై మాట్లాడారు. జాబ్ మేళాకు యువత తరలిరావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.