KMM: ఏదులాపురం మున్సిపాలిటీలో చింతపల్లి నుంచి ముత్తగూడెం వరకు రూ.6.50కోట్ల వ్యయంతో చేపట్టిన బీటీ రోడ్డు నిర్మాణ పనులకు బుధవారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శంకుస్థాపన చేశారు. పనులను వర్షాకాలానికి ముందే నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతాయని తెలిపారు.