WNP: గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా పీఏసీ పనిచేస్తుందని చిన్నారెడ్డి తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. బూత్ లెవల్ ఏజెంట్లు కష్టపడి ప్రజా సమస్యలు పరిష్కరిస్తేనే ఓటు బ్యాంక్ పెరుగుతుందని అన్నారు. నిబద్ధత గల కార్యకర్తలకు పదవులు ఇవ్వాలని, సంక్షేమ పథకాలను నిరుపేదలకు చేర్చి ప్రభుత్వానికి ఆదరణ పెంచాలని పిలుపునిచ్చారు.