KMR: లింగంపేట మండలం కోర్పల్ గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు బుధవారం తెలంగాణ జాగృతిలో చేరారు. వారికి జిల్లా తెలంగాణ జాగృతి అధ్యక్షుడు సంపత్ గౌడ్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై తెలంగాణ జాగృతి నిరంతర పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపేట మండలం తెలంగాణ జాగృతి అధ్యక్షుడు సాయిలు, పలువురు నాయకులు ఉన్నారు.