ADB: తాంసి మండలంలో చైల్డ్ పోర్నోగ్రఫీ చూసిన ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ ఫణిదర్ తెలిపారు. వడ్డాడి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చైల్డ్ పోర్నోగ్రఫీ చూడటంతో పాటు ఇన్స్టాగ్రామ్లో ఇతరులకు షేర్ చేసినట్లు విచారణలో తేలిందన్నారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.