NGKL: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 136వ జయంతి సందర్భంగా మంగళవార జిల్లా కేంద్రంలో వేడుకలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ బాదావత్ సంతోష్ తెలిపారు. ఉదయం 9 గంటలకు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించి, అనంతరం ఉత్సవ సభ నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కళాజాత బృందాలచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.