SRCL: చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ తీగలు వేలాడుతుండడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. హార్వెస్టర్లతో వరి పంట కోసేందుకు ఇబ్బందులకు గురవుతున్నారు. విద్యుత్ తీగలు కిందకు వేలాడడంతో కొందరు రైతులు కర్రలతో విద్యుత్ తీగలను పైకెత్తి హార్వెస్టర్‌తో పంట కోతలు పూర్తి చేస్తున్నారు. అధికారులు వేలాడుతున్న తీగలను సరిచేయాలని కోరుతున్నారు.