MLG: కేంద్ర ప్రభుత్వ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమంలో భాగంగా మేఘాలయలోని ఐఐఎం షిల్లాంగ్‌కు చెందిన 49 మంది విద్యార్థులు నిన్న ప్రసిద్ధ రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేయగా, టూరిజం గైడ్ వెంకటేష్ ఆలయ చరిత్ర, విశిష్టతలను విద్యార్థులకు వివరించారు.