HNK: గడ్డి మందు సైనైడ్ కంటే ప్రమాదకరం అని వరంగల్ ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ప్రాణాంతకమైన గడ్డి మందును వెంటనే నిషేధించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో ఎంపీ పాల్గొన్నారు. గడ్డి మందు నిషేధంపై కేంద్ర మంత్రులను కలుస్తానని, గడ్డి మందు రద్దు వరకూ నా పోరాటం కొనసాగిస్తానని ఎంపీ చెప్పారు.