SRCL: ఎల్లారెడ్డిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో లేగ దూడపై చిరుత దాడి చేసింది. గ్రామానికి చెందిన సదుల పూర్ణ అనే రైతు ప్రతిరోజు తన వ్యవసాయ పొలం వద్ద పాడి గేదెతోపాటు, లేగదుడను కట్టేసి ఇంటికి వెళ్ళాడు. రాత్రివేళ లేగ దూడపై చిరుత దాడి చేసినట్లు తెలిపాడు. ఉదయం పొలం వద్దకు వెళ్లేసరికి లేగ దూడ మృతి చెంది ఉన్నట్లు పేర్కొన్నాడు.