MBNR: వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని మండలంలోని చర్లపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని సర్పంచ్ జోగు లక్ష్మమ్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పావని, కార్యదర్శి నవీన్ కుమార్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.