MDK: జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ చేగుంట మండలం వాడియారంలో ‘ప్రజా పాలన -ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల కార్యక్రమంలో పాల్గొన్నారు.సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలని,పారిశుధ్యం, విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. వాడియారాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ సభలో మండల అధికారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు