ADB: ఆదిలాబాద్‌లోని గెజిటెడ్ నం.1 పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు. అతివేగం ప్రమాదాలకు దారితీస్తుందని, ప్రాణాల రక్షణే ప్రథమ కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.