KMR: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులు గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహారం అందించడం జరుగుతుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ హరిత చెప్పారు. సోమవారం నాగిరెడ్డిపేట మండలం అక్కంపల్లిలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ పక్వాడ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా పౌష్టికాహారం తీసుకోవాలనే సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకట గౌడ్ నాయకులు ఉన్నారు.