SDPT: అక్బర్పేట-భూంపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అరుగొండ నాగార్జున(35) చెరువులో పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శుక్రవారం సాయంత్రం పంక్చర్ షాప్‌కి వెళ్తానని ఇంటి నుంచి వెళ్లిన నాగార్జున రాత్రైనా ఇంటికి తిరిగి రాలేదు. శనివారం మధ్యాహ్నం గ్రామంలోని పెద్ద చెరువులో అతడి మృతదేహం లభ్యమైంది.